📅 Saturday, 24 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS బొగ్గు రవాణా చేస్తున్న డ్రైవర్లు,క్లీనర్లకు లాభాల వాటా ఇవ్వాలి.
‹
›
District News

ఉచిత నేత్ర వైద్య శిబిరంవాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కోటపల్లి సీఐ ఆర్. కృష్ణ

◉ Kodishetti Sathish   |   ◷ Latest
ఉచిత నేత్ర వైద్య శిబిరంవాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కోటపల్లి సీఐ ఆర్. కృష్ణ
చెన్నూరుసాక్షర :కోటపల్లిలయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూరు ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ, మంగళవారం స్థానిక సాయిరాం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం వాల్ పోస్టర్‌ను కోటపల్లి సీఐ ఆర్. కృష్ణ శనివారంఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీఐ ఆర్. కృష్ణ మాట్లాడుతూ, పేదలకు ఉచిత నేత్ర వైద్య సేవలు అందించడం అభినందనీయమని, ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరం ద్వారా కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలకు వైద్య సేవలు అందించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూరు అధ్యక్షుడు లయన్ నిమ్మల సాగర్, జోన్ చైర్‌పర్సన్ లయన్ జాడి తిరుపతి, భూతం శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.