రహదారి కబ్జా పట్టించుకోరా అధికారులను ప్రశ్నిస్తున్న అన్నదాత
నిరంతరం ప్రజలు రైతులు నడిచే రహదారిని బాజాప్తా కబ్జా చేసిన పట్టించుకోరా అని మండలంలోని అన్నదాత అధికారులను ప్రశ్నిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే మండలంలోని రోటిగూడ గ్రామంలో పంటపొలాలకు ప్రతినిత్యం నడిచేదారిని యదేచ్చగా కబ్జా చేశారని దీనిపైన ఎన్నిసార్లు అధికారులకు పిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడంలేదని గ్రామానికి చెందిన అన్నదాత పులిశెట్టి వెంకటేష్ తెలిపారు. శనివారం రోజున అయన మాట్లాడుతూ గ్రామంలో 324 సర్వే నెంబరు లో రైతులు పొలాలకు వేల్లెదారిని కబ్జా చేశారని ఈ విషయంలో మండలకేంద్రంలో సోమవారం జరిగే ప్రజావానిలో పిర్యాదు చేశానని మండల నీటి పారుదల శాఖా అధికారులకు సైతం పిర్యాదు చేశానని ఎన్ని పిర్యాదులు చేసిన ఎవరు స్పందించడంలేదని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాదికారులు స్పందించి కబ్జా దారులనుండి రహదారిని రక్షించాలని అయన ఉన్నతాదికారులను కోరారు.
