బాసరలో అక్టోబర్ 26 నుంచి ఆన్‌లైన్ తరగతులు
- 2026-27 విద్యా సంవత్సరానికి సవరించిన అకడమిక్ షెడ్యూల్ విడుదల.. నవంబర్ 19 నుంచి మిడ్‌టర్మ్ పరీక్షలు
నవంబర్ 10న పీయూసీ విద్యార్థులు క్యాంపస్‌కు
పీయూసీ-1, పీయూసీ-2 విద్యార్థులు నవంబర్ 10న క్యాంపస్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. నవంబర్ 10 నుంచి 18 వరకు వీరికి క్యాంపస్‌లో తరగతులు నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ ఈ-1 నుంచి ఈ-4 వరకు విద్యార్థులు నవంబర్ 18న క్యాంపస్‌కు చేరుకోవాలి. విద్యార్థులు యాజమాన్యం సూచించిన తేదీల్లోనే క్యాంపస్‌కు హాజరుకావాలని అధికారులు స్పష్టం చేశారు.
నవంబర్ 19 నుంచి మిడ్‌టర్మ్ పరీక్షలు
పీయూసీ నుంచి ఈ-4 వరకు అన్ని బ్యాచ్‌ల విద్యార్థులకు మిడ్‌టర్మ్-2, మిడ్‌టర్మ్-3 ఆబ్జెక్టివ్ పరీక్షలు నవంబర్ 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. ఎండ్ సెమిస్టర్ థియరీ, ప్రాక్టికల్ పరీక్షలన్నీ ఆఫ్‌లైన్ విధానంలోనే జరగనున్నాయి.
ఈ-1, ఈ-2 విద్యార్థులకు నవంబర్ 23 నుంచి 28 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 6 వరకు థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ-3, ఈ-4 విద్యార్థులకు నవంబర్ 23 నుంచి 29 వరకు థియరీ పరీక్షలు, నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. పీయూసీ-1, పీయూసీ-2 విద్యార్థులకు నవంబర్ 23 నుంచి డిసెంబర్ 6 వరకు థియరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
రిమిడియల్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల
బీ22, బీ23, బీ24 పీయూసీ బ్యాచ్‌లకు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 11 వరకు రిమిడియల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ రెండో సెమిస్టర్ రిమిడియల్ పరీక్షలు నవంబర్ 10 నుంచి 18 వరకు జరగనున్నాయి. మిగిలిన పెండింగ్ పరీక్షలు, పీయూసీ-1, పీయూసీ-2 రిమిడియల్ పరీక్షలు డిసెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి.
విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులు, పరీక్షలు, క్యాంపస్‌కు తిరిగి వచ్చే తేదీలకు సంబంధించి యూనివర్సిటీ జారీ చేసే తాజా సూచనలను ఎప్పటికప్పుడు గమనించాలని యాజమాన్యం సూచించింది. సవరించిన అకడమిక్ షెడ్యూల్‌కు అనుగుణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరింది.
