📅 Saturday, 24 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS కాటా శ్రీనివాస్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ సర్పంచ్ జయమ్మ
‹
›
District News

నేడు టీ ఏ వి వి వి మంచిర్యాల జిల్లా కమిటి నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం

◉ Kodishetti Sathish   |   ◷ Latest
నేడు టీ ఏ వి వి వి మంచిర్యాల జిల్లా కమిటి నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం
మంచిర్యాల సాక్షర :
విధ్య, వైద్యం, ఉపాధితో పాటు ఆర్యవైశ్యులను అన్ని రంగాల్లో ముందుకు నడిపించుటకు గాను అవిర్భవించిన తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్య క్రమాలను విస్తరింపజేయుటకు గాను "జిల్లా కార్యవర్గములను" ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా "టిఏవివివి మంచిర్యాల జిల్లా కార్యవర్గమును "ఏర్పాటు చేసి ఈ నెల 25, ఆదివారం సాయంత్రం 6.00 గంటలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైలైప్ హెూటల్ లో మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నారు. రెండు సంవత్సరముల పాటు కొనసాగే ఈ నూతన కార్యవర్గమునకు అధ్య క్షులుగా కుంకుముట్టి వెంకటేశ్, ప్రధాన కార్యదర్శిగా కాసం మల్లిఖార్జున్, కొశాధిరిగా గుల్బం శ్రీధర్, ప్రథమ ఉపాధ్యక్షులులుగా నెరేళ్ళ శ్రీనివాస్లను ప్రకటించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరియు ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక అధ్యక్షులు బల్లు చంద్రప్రకాశ్ గుప్తా గెస్ఆఫ్ హానర్స్ గా టివివివిప్ ప్రధాన కార్యదర్శి కొమురవెల్లి సుధాకర్, కోశాధికారి సిరిపురం శ్రీనివాస్, ఛీప్ అడ్వయిజర్ కె.వి.ప్రతాప్లు హాజరుకానున్నారు. వీరితో పాటు పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ జిల్లాలకు నూతనంగా ప్రకటించిన పెద్ది వెంకటేశ్, సిరిపురం ఈశ్వర్, పెద్ది ఆంజనేయులులు సైతం హాజరు కానున్నారు. వీరితో మంచిర్యాల జిల్లాలోని రాష్ట్ర కమిటి ప్రతినిధులు, వ్యవస్థాపక సభ్యులు కూడా పాల్గొంటారని తెలిసింది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కమిటి అధ్య క్షులు కుంకుముట్టి వెంకటేశ్ మాట్లాడుతూ వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్న మంచిర్యాల జిల్ల కేంద్రంలో ఆర్యవైశ్యుల సంఖ్యాబలం నానాటికి పెరిగుతుందని, ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో అనేక సంఘాలు, సేవా సంస్థలు సమాజాభివృద్దికి కృషిచేస్తున్నాయని, వాటన్నింటికీ ధీటుగా కార్యక్రమాలను నిర్వహించుటకు గాను మంచిర్యాల జిల్లా టివివివివి ఏర్పాటు చేయడం జరి గిందన్నారు. ఇం దుకు గాను అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకత్వమును ధన్యవాదములు తెలిపారు. వ్యాపారవర్గంతో పాటు ఉపాధ్యాయలు, లెక్చరర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, అడ్వకేట్లు, తెలంగాణ విద్యుత్ సంస్థల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న అనేకమంది ఆర్యవైశ్యులతో.. ముఖ్యం గా డిగ్రీ పూర్తిచేసిన యువతీ, యువకులను జీవితసభ్యులుగా ఈ సంస్థ ముందుకు సాగుతుందన్నారు. 500 రూపాయల తో జీవితసభ్యులుగా చేరే అవకాశముందని, ఇట్టి అవకాశాన్ని ఆర్యవైశ్య యువతి, యువకులు సద్వీనియోగం చేసుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్ల నుండి సుమారు 200 మందిని జీవిత సభ్యులుగా తీసుకుంటున్నట్లు వివరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరుగబోయే తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక మంచిర్యాల జిల్లా నూతన కమిటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.