📅 Thursday, 22 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
25°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

భైంసాలో పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసిన దుర్గామాత నిమజ్జనోత్సవాలు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
భైంసాలో పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసిన దుర్గామాత నిమజ్జనోత్సవాలు
  • ముధోల్‌లోను నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, భద్రతా చర్యలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ
నిర్మల్ అక్టోబర్ 22 (సాక్షర ప్రతినిధి)
భైంసా పట్టణంలో దుర్గామాత నిమజ్జనోత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. భక్తులు, ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ 300 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, స్వయంగా భైంసాలో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని, శోభాయాత్ర మార్గాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, నిమజ్జన ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి పర్యవేక్షించారు.
భైంసా పట్టణాన్ని నాలుగు సెక్టర్లుగా విభజించి పంజీసా మసీదు, పురాణ బజార్, బ్రాహ్మణ గల్లి, బట్టి గల్లి, కిసాన్ గల్లి, పిపిరి కాలనీ, కుబేర రద్దా, పంజీసా చౌక్ తదితర ప్రాంతాల్లో పోలీసులను నియమించారు. ట్రాఫిక్ నియంత్రణ, పుషింగ్ పార్టీలు, రూఫ్‌టాప్ బందోబస్తు, బైక్ పెట్రోలింగ్, స్టాటిక్ బందోబస్తు వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.భైంసాతో పాటు ముధోల్ పట్టణంలోనూ జిల్లా ఎస్పీ స్వయంగా పర్యటించి దుర్గామాత నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి, భద్రతా చర్యలను పర్యవేక్షించారు. రెండు పట్టణాల్లోనూ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.
బందోబస్తులో సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన భక్తులు, మండపాల నిర్వాహకులు, ప్రజలకు నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ కృతజ్ఞతలు తెలియజేసింది.ఈ కార్యక్రమాల్లో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.