📅 Thursday, 22 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
25°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

పంటలకు సరిపడా విద్యుత్ అందించాలి

◉ Kotha Venugopal   |   ◷ Latest
పంటలకు సరిపడా విద్యుత్ అందించాలి
జన్నారం మండలంలోని అన్నదాతలు పండించిన పంటలకు సరిపడా విద్యుత్తును అధికారులు అందించాలి అని భారత రాష్ట్ర సమితి మండల శాఖ అధ్యక్షులు గుర్రం రాజారాంరెడ్డి అన్నారు శనివారం రోజున జన్నారం మండల కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న పది సంవత్సరాలు విద్యుత్ సమస్య రాష్ట్రంలో ఎంత ఉన్నా కానీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయడం జరిగిందని వారికి ఎలాంటి పంట నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని విధాలా సహకరించినట్లు ఆయన తెలిపారు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో విపులం అయిందని ఆయన ఆరోపించారు అన్నదాతలు ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికి ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్ పార్టీ రాష్ట్ర జిల్లా మండలా నాయకులు జాడి గంగాధర్ ఫజల్ ఖాన్ సుతారి వినయ్ కుమార్ మున్వర్ అలీ ఖాన్ సిటీ మల్ల భరత్ కుమార్ ప్రభుదాస్ జంగం రవి దుమల్ల ఎల్లయ్య ఐలవేణి రవి నర్సా గౌడ్ తదితరులు