📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
22°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

బతుకమ్మ సంబరాల్లో పాల్గొని దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసిన కాట సుధా శ్రీనివాస్ గౌడ్

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
బతుకమ్మ సంబరాల్లో పాల్గొని దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసిన కాట సుధా శ్రీనివాస్ గౌడ్
  • రామచంద్రపురం పోచమ్మ ఆలయంలో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు రామచంద్రపురం డివిజన్ పరిధిలోని పాత రామచంద్రపురం శ్రీ పోచమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మహిళలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం భక్తిశ్రద్ధలతో నిర్వహించిన దుర్గామాత పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రకృతిని పూల రూపంలో ఆరాధిస్తూ మహిళలు ఐకమత్యంతో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రత్యేకతను చాటిచెబుతుందని పేర్కొన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కుమార్ గౌడ్, ఈశ్వర్ సింగ్, నరేష్ ముదిరాజ్, నవీన్ గౌడ్, కిరణ్ గౌడ్, హబీబ్ జానీ, మానయ్య, మహిళలు, స్థానిక భక్తులు, కాలనీవాసులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.