📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
22°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

పంట పొలాల్లో పాముకాటు పై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
పంట పొలాల్లో పాముకాటు పై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
  • పంట పొలాల్లో పాముకాటు పై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.. బహుజన సమాజ్ పార్టీ నిర్మల్ జిల్లా సెక్రెటరీ చెరుకు రాజ్యం డిమాండ్
నిర్మల్ ఆగస్టు 17(సాక్షర ప్రతినిధి):
పంట పొలాల్లో పాము కాటుకు గురై రైతు ప్రాణాలు కోల్పోవడం వ్యక్తిగత దూరదృష్టం కాదు రైతు భద్రత విషయంలో ప్రభుత్వ వ్యవస్థ మరింత బలపడాల్సిన అవసరాన్ని చూపించే ఘటన అని బహుజన సమాజ్ పార్టీ నిర్మల్ జిల్లా సెక్రటరీ చెరుకు రాజ్యం తెలిపినారు.కేంద్రం ఆరోగ్యశాఖ కూడా పాము కాటు విషయంలో తక్షణ ప్రథమ చికిత్స వెంటనే ఆసుపత్రికి తరలింపు యాంటీ స్నేక్ వెనం అందుబాటు, అంబులెన్స్ వ్యవస్థను, బలోపేతం చేయాలని
చెరుకు రాజ్యం డిమాండ్ చేసినారు :
ప్రభుత్వానికి రైతుల తరఫున ప్రధాన డిమాండ్లు.........
ప్రతి మండల ప్రభుత్వ ఆసుపత్రిలో యాంటీ స్నేక్ -వెనం అందుబాటులో ఉండాలనీ, పాము కాటుకు గురైన రైతుకు దూర ప్రాంతాలకు తీసుకెళ్లే లోపు ప్రాణాపాయం ఏర్పడకుండా 24 గంటల అత్యవసర వైద్యం అందాలనీ తెలిపినారు.ప్రతి గ్రామీణ ప్రాంతానికి అత్యవసర అంబులెన్స్ సదుపాయం ఉండాలనీ, పాము కాటు జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించే వ్యవస్థ ఉండాలనీ,రైతులకు ఉచిత రక్షణ పరికరాలు ఇవ్వాలనీ,పొలాల్లో పని చేసే రైతులకు రబ్బర్ బూట్లు, టార్చ్ లైట్, రక్షణ పరికరాలు అందించాలనీ డిమాండ్ చేసినారు.ప్రతి గ్రామంలో పాము కాటు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పాము కరిచిన వెంటనే ఏం చేయాలి? ఏం చేయకూడదు! అనే విషయాలపై రైతులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ముఖ్యంగా మంత్రాలు, మూలికలు, కోయడం, విషo పీల్చడం* వంటి ఆలస్యానికి దారి తీసే పద్ధతులను నమ్మకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లే అవగాహన కల్పించాలన్నారు.రైతు కుటుంబానికి భీమ పరిహారమందించి,పాము కాటు వల్ల రైతు మరణించినప్పుడు అర్హత ప్రకారం రైతు బీమా ఇతర ప్రభుత్వ పరిహారం త్వరగా అందేలా ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్నారు.కుటుంబం అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదనీ బహుజన్ సమాజ్ పార్టీ నిర్మల్ జిల్లా సెక్రటరీ చెరుకు రాజ్యం డిమాండ్ చేశారు.