📅 Friday, 06 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
25°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS రెడ్‌క్రాస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి
‹
›
District News

కవ్వాల్ పులుల అభాయరన్యాన్ని సందర్శించిన జాతీయ పులుల సంరక్షణ ప్రాదికార సంస్థ మూల్యాంకన బృందం

◉ Kotha Venugopal   |   ◷ Latest
కవ్వాల్ పులుల అభాయరన్యాన్ని సందర్శించిన జాతీయ పులుల సంరక్షణ ప్రాదికార సంస్థ మూల్యాంకన బృందం
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల అభయారన్యాన్ని జాతీయ పులుల సంరక్షణ ప్రాదికార సంస్థ మూల్యాంకన బృందం పర్యటించినట్లు జన్నారం అటవీ డివిజనల్ అధికారి రామ్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్త టైగర్ రిజర్వ్ ల నిర్వహణ సామర్థ్యం మూల్యాంకన లో బాగంగా నలుగురు సబ్యుల బృందం ఈనెల 4 నుండి 6 వ తేది వరకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ను సందర్శించినట్లు అయన తెలిపారు. ఇక్కడ అటవీ సంరక్షణ వన్యప్రాణుల సంరక్షణ కొరకు అమలు చేస్తున్న చర్యలపై పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అటవీ రక్షణ వన్యప్రాణుల సంరక్షణ అటవీ భూములు వనరుల సంరక్షనతోపాటు మరింత అబివృద్ది చేయడానికి తీసుకోవలసిన చర్యలు తదితర విషయలపై చర్చించారు. ఈ పర్యటనలో కేంద్ర బృందంకు నాయకత్వం విశ్రాంత ఐ ఎఫ్ ఎస్ అధికారి ఆర్ పి సింగ్ సబ్యులు విశ్రాంత ఐ ఎఫ్ ఎస్ అధికారి ధనంజయ్ మోహన్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సీనియర్ డైరెక్టర్ డా; దీపాంకర్ ఘోష్ భారత వన్యప్రాణి సంస్థ శాస్త్రవేత్త డా; అమర్జిత్ కౌర్ వున్నారని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఎఫ్ డి పి టి ఎస్ శాంతారాం మంచిర్యాల ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాల అటవీ అధికారులు రాహుల్ జాదవ్ బాలామణి సుశాంత్ బొబ్డే జన్నారం మంచిర్యాల ఖానాపూర్ ఉట్నూర్ ఆసిఫాబాద్ చెన్నూర్ అటవీ డివిజన్ల అధికారులు ఏం రామ్మోహన్ ఏ అప్పయ్య కే అనిత అరవింద్ సర్వేశ్వర్ రామ్మూర్తి విజయకుమార్ జన్నారం డివిజనల్ రేంజ్ అధికారులు ఖాదర్ వలి వికాస్ మమత శంకర్ హన్మంతరావు అతవుల్లా రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.