మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన జడ్పీ మాజీ చైర్ పర్సన్
- అంబరాన్నంటిన సంబరాలు
నిజాంసాగర్,మహమ్మద్ నగర్ మండలంలోని ఆయా గ్రామాలలో సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలను ఆదివారం మహిళలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం లేచి గునుకా తంగేడు తదితర పువ్వులను పోటాపోటీగా తీసుకువచ్చి బతుకమ్మలను మహిళలు ఘనంగా బతుకమ్మను పేర్చారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బతుకమ్మలను ఏర్పాటు చేసి బతుకమ్మ పాటలతో మహిళలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో జడ్పీ మాజీ చైర్ పర్సన్ దఫేదర్ శోభ రాజు మహిళలను కలిసి బతుకమ్మ ఆడి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మలను భాజా భజంత్రీలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు.
