సామాన్య వాహనదారుల నడ్డి విరుస్తున్న నయార ప్రైవేట్ పెట్రోల్ బంకులు.
- ప్రైవేట్ బంకుల్లో పెట్రోల్,డీజిల్ పై పైసలు ఎక్కువ. అమ్మో లీటర్ పెట్రోల్ పై 5 రూపాయలు లీటర్ డీజిల్ పై 3 రూపాయలు.......... తెలవకుండానే దోచుకుంటున్న నయార ప్రైవేట్ పెట్రోల్, పంపులనీ ఆవేదన వ్యక్తం చేస్తున్న సామాన్య వాహనదారులు.......
నిర్మల్ జిల్లా లోని నయార ప్రైవేట్ పెట్రోల్ బంక్ బంకులలో లీటర్ పెట్రోల్ పై ఐదు రూపాయలు అలాగే లీటర్ డీజిల్ పై మూడు రూపాయలు అదనంగా వాహనదారుల నుండి వసూలు చేస్తున్నారు. వాహనదారులకు తెలియకుండానే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనీ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పెట్రోలు ధరల కంటే ప్రైవేట్ పెట్రోలు పంపులలో లీటర్ పెట్రోల్ 122.44 కాగా లీటర్ డీజిల్ 108.29 అధిక ధరలకు అమ్మడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చి సామాన్య వాహనదారుల నడ్డి విరుస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు నెలల క్రితం సాక్షర దినపత్రికలో ప్రైవేటు బంకులు అధిక ధరలు ప్రచురించిన శీర్షిక ఆధారంగా ధరలు తగ్గించి ప్రభుత్వ బంకుల ధరలతో సమానంగా ప్రైవేట్ యాజమాన్యం అమ్మకాలు జరిపినారు. వాహనదారులు మరువగానే మళ్లీ లీటర్ పెట్రోల్ పై ఐదు రూపాయలు లీటర్ డీజిల్ పై 3 రూపాయల అధిక ధరలతో అమ్మడంతో వాహనదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ పై పెరుగుతున్న అధిక ధరలు
తగ్గించాలని ఒకపక్క ప్రజలు వాహనదారులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారని వాహనదారు లు తెలుపుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రైతుల మాట , వాహన దారుల మాట పెడచెవిన బెట్టి ప్రైవేట్ సంస్థలు అధిక ధరలకు అమ్ముకునేందుకు అధికారం కల్పించడం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అదనంగా పైసలు దోచుకుంటూ ప్రజలపై భారాన్ని మోపుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు గమనించి ఇలాంటి ప్రైవేటు సంస్థలకు స్వస్తి పలికి ప్రభుత్వం పెట్రోల్ పంపులతో సమానంగా ప్రైవేట్ పంపుల్లో కూడా అమ్మాలని వాహనదారులు కోరుతున్నారు
