📅 Thursday, 22 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
25°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

అమ్మవారి వద్ద వేలంపాటల జోరు

◉ Kotha Venugopal   |   ◷ Latest
అమ్మవారి వద్ద వేలంపాటల జోరు
జన్నారం సాక్షర
జన్నారం మండలకేంద్రంలోని శ్రీ దుర్గామాత అమ్మవారి వద్ద వేలంపాట జోరుగా సాగింది. శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో బాగంగా మండలకేంద్రంలో శ్రీ నవదుర్గా యూత్ శ్రీ సిద్దివినాయక యూత్ ల అద్వర్యంలో రెండు చోట్ల అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చివరిరోజు అమ్మవారికి 9 రోజులు 9 అవతారాలలో అలంకరించిన చీరలు కళాశాలు లడ్డు లను నిర్వాహకులు వేలంపాటల ద్వార భక్తులకు అందజేస్తారు. నవరాత్రులు ఉదయం సాయంత్రం పూజలు అందుకున్న వీటిని తీసుకోవడానికి భక్తులు పోటి పడ్డారు. ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసిన సి సిద్దివినాయక అమ్మవారి మంటపం వద్ద పోటి చాలా పెరిగింది ప్రతి వస్తువు పొందడానికి భక్తులు చాలామంది పోటిపడ్డారు. ఇక్కడి ప్రతి వస్తువు అమ్మవారి ప్రసాదం అమ్మవారి ఆశీర్వాదం అని బావిస్తూ ఈ వస్తువులను తీసుకుంటారు. వేలంపాటలో ఈ వస్తువులు పొందిన వారిని నిర్వాహకులు సన్మానించి పురోతుల ద్వార వస్తువులను అందజేస్తారు. సిద్దివినాయక మండపం వద్ద అమ్మవారికి 10 రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం అలంకరణ చీరను స్థానిక వ్యాపారవేత్త రాంసింగ్ పురోహిత్ 11016/- రూపాయలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.