📅 Tuesday, 03 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
26°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS అనారోగ్య సమస్యతో ఉరి వేసుకుని ఒకరి మృతి.
‹
›
National News

భారత్ తో కయ్యం..పాకిస్తాన్ లో కోలుకోలేని దెబ్బ

◉ ELUGU VAMSHIDHAR   |   ◷ Latest
భారత్ తో కయ్యం..పాకిస్తాన్ లో కోలుకోలేని దెబ్బ
సాక్షర, ముంబై: భారత్‌తో వాణిజ్య సంబంధాలు నిలిచిపోవడంతో 2019 నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్‌కు సుమారు 40 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3.5 లక్షల కోట్ల) ఆర్థిక నష్టం వాటిల్లిందని పాక్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ నూర్‌ మహమ్మద్‌ ఖసూరి వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో వాణిజ్య బంధాలు దెబ్బతిన్నాయని తెలిపారు. గతంలో భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల కోసం ఇప్పుడు పాక్‌ దూర ప్రాంతాల్లోని దేశాలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. దీంతో సరుకు రవాణా ఛార్జీలు పెరగడంతో పాటు వస్తువులు చేరేందుకు ఎక్కువ సమయం పడుతోందని వివరించారు.భారత్‌ నుంచి ముడిసరుకులు దిగుమతి చేసుకునే పాకిస్థాన్‌ ఔషధ రంగంపై ఈ పరిణామం ప్రభావం చూపిందని ఖసూరి పేర్కొన్నారు. భారత్‌తో తిరిగి వాణిజ్యం ప్రారంభిస్తే ఏటా 2 నుంచి 3 బిలియన్‌ డాలర్లు ఆదా చేయవచ్చని అంచనా వేశారు. దేశీయంగా పత్తి ఉత్పత్తి తగ్గడంతో వస్త్ర పరిశ్రమకు అదనంగా 5 బిలియన్‌ డాలర్ల భారం పడిందన్నారు. దీంతో బ్రెజిల్‌, ఈజిప్ట్‌, చైనా, అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని తెలిపారు. పత్తి పండించే ప్రాంతాల్లో రైతులు చెరకు సాగు వైపు మళ్లుతుండటంతో భవిష్యత్తులో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.చక్కెర, ఎరువులు, సిమెంట్‌, పెట్రోలియం ఉత్పత్తులు, ఇనుము, ఉక్కు, కూరగాయలు, భారీ యంత్రాల కోసం కూడా పాకిస్థాన్‌ దూర దేశాలపై ఆధారపడుతోందని ఖసూరి చెప్పారు. భారత్‌తో వాణిజ్యం పునరుద్ధరిస్తే రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు సరఫరా వ్యవస్థ మెరుగుపడుతుందని, పెట్రోలియం దిగుమతుల భారం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో భారత పర్యాటకులు పాకిస్థాన్‌లోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలతో పాటు వారి పూర్వీకుల గ్రామాలను సందర్శించేవారని, వాణిజ్య సంబంధాలు తెగిపోవడంతో ఆ పర్యాటక ఆదాయాన్నీ కోల్పోయామని తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, కుటుంబ సంబంధాలు మెరుగైన ప్రాంతీయ సహకారానికి పునాదిగా నిలవగలవని పేర్కొన్నారు.