పోలీస్ కుటుంబాల ఆత్మీయ బతుకమ్మ సంబరాలు
- జిల్లా జడ్జి శ్రీవాణితో కలిసి వేడుకలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఐపీఎస్
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ........ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఇలాంటి వేడుకలు పోలీస్ కుటుంబాల మధ్య ఐక్యత, ఆత్మీయతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పోలీసుల విధి నిర్వహణలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, ఐపీఎస్, నిర్మల్ డీఎస్పీ పి. శ్రీనివాస్, పోలీస్ అధికారులు, సిబ్బంది, షీ టీమ్, భరోసా టీమ్ సభ్యులు, పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
