మాజీ మంత్రి హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నందారం నరసింహ గౌడ్
- దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్
అమీన్పూర్: దసరా పండుగను పురస్కరించుకుని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ప్రమోద్ గౌడ్‌తో పాటు జగదీష్, జ్ఞానేశ్వర్, సందీప్ పాల్గొన్నారు.
