📅 Thursday, 22 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
Politics

BHEL నుంచి శబరిమల వరకు జై గణసేన మహా పాదయాత్ర

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
BHEL నుంచి శబరిమల వరకు జై గణసేన మహా పాదయాత్ర
  • మహా పాదయాత్రకు బీజేపీ డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్‌కు ఆహ్వానం
రామచంద్రపురం BHEL నుంచి శబరిమల వరకు ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహించనున్న జై గణసేన శబరిమల మహా పాదయాత్ర సందర్భంగా గురుస్వామి శ్రీనివాస్ రెడ్డి, రామచంద్రపురం 268వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు ఎన్. నర్సింగ్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పాదయాత్రకు ఆహ్వానించారు. అక్టోబర్ 22, 2026న ప్రారంభం కానున్న ఈ మహా పాదయాత్ర BHEL నుంచి శబరిమల వరకు కొనసాగనుంది. అయ్యప్ప స్వామి భక్తి, ఆధ్యాత్మిక చింతనతో చేపట్టనున్న ఈ పవిత్ర పాదయాత్ర విజయవంతం కావాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా నర్సింగ్ గౌడ్ మాట్లాడుతూ, అయ్యప్ప స్వామివారి దివ్య ఆశీస్సులతో మహా పాదయాత్ర విజయవంతంగా సాగాలని, యాత్రలో పాల్గొనే ప్రతి అయ్యప్ప స్వామికి స్వామివారి అనుగ్రహం లభించాలని ఆకాంక్షించారు.