📅 Thursday, 29 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS పౌల్ట్రీ ఫారమ్‌ల నిర్వహణపై నిఘా ఏదీ?
‹
›
District News

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
  • 17వ రోజుకు చేరిన నిరవధిక సమ్మె.. నిర్మల్‌లో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ
నిర్మల్ అక్టోబర్ 30 (సాక్షర ప్రతినిధి)
జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచడంతో పాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె గురువారంతో 17వ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు నిర్మల్‌లో ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రయాణ ప్రాంగణం మీదుగా సాగి, శివాజీ చౌక్ నుంచి తిరిగి ఆర్డీవో కార్యాలయానికి చేరుకుంది. ఈ ర్యాలీ ద్వారా తమ సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, తమకు న్యాయం జరిగే వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు గంగాధర్, కోఆర్డినేటర్ రమణ, కార్యదర్శి యోచనతో పాటు డాక్టర్లు రమేష్, నాగరాజు, అలీ, సంధ్యారాణి, మనీషా, స్వప్న, సుజాత, రాధ తదితరులు పాల్గొన్నారు.