రెబ్బెన,సాక్షర:బెల్లంపల్లి ఏరియాలోని అన్ని గనులు,విభాగాల అధికారులతో డీజీఎం ఇంటర్నల్ ఆడిట్ బెల్లంపల్లి రీజియన్ మధుబాబు ఆధ్వర్యంలో ఎస్ఓ టు జిఎం స్వామి రాజు అధ్యక్షతన గురువారం గోలేటి లోని ఏరియా జిఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు.గనులు,విభాగాల వారీగా కంట్రాక్టర్లకు సంబంధిత బిల్లుల పై పలు సూచనలు చేశారు.ఆడిట్ రికవరీలు,పెండింగులో ఉన్న ఆడిట్ మెమోలపై సమీక్షించారు.స్టోర్లలో నిల్వలు వ్యత్యసాలపై ఎప్పటికప్పుడు భౌతిక దృవీకరణ చేసుకోవాలని సూచించారు.ఖచ్చిత మైన బిల్లులను సకాలంలో సమర్పించాలని,హెచ్ బిఎల్ఆర్ఎస్ క్లైముల స్థితి గతంలో వచ్చిన అభ్యంతరాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్ వీరన్న,డీజిఎం(ఐఈడి)ఉజ్వల్ కుమార్ బెహరా,ఫైనాన్స్ మేనేజర్ మామిడి రవికుమార్,సిహెచ్పి హెచ్ఓడి కోటయ్య,ఖైరిగుర ఓసి మేనేజర్ జె.శంకర్,సీనియర్ పర్సనల్ అధికారి మండల శ్రీనివాస్ అన్ని విభాగాల అధికారులు,ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
— M VIJAYAREBBENA REPORTER