📅 Thursday, 29 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
25°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS ఆడిట్ అధికారుల సమీక్షా సమావేశం.
‹
›
District News

ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు
  • డిసెంబర్ 22న నిర్మల్ జిల్లాకు చేరుకోనున్న అంతర్జాతీయ సైక్లింగ్ బృందం.. ఘన స్వాగతం, వసతి, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ అక్టోబర్ 29 (సాక్షర ప్రతినిధి)
ఇండో–శ్రీలంక మైత్రి సేతు అంతర్జాతీయ సైకిల్ యాత్రలో భాగంగా డిసెంబర్ 22న నిర్మల్ జిల్లాకు చేరుకోనున్న సైక్లింగ్ బృందానికి ఘన స్వాగతం పలికేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. యాత్ర విజయవంతంగా కొనసాగేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.
జిల్లాకు చేరుకునే సైక్లింగ్ బృందానికి తగిన వసతి, ఆతిథ్య సౌకర్యాలు కల్పించాలని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సైకిల్ యాత్ర నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లా వైపు వెళ్లేందుకు అనువైన రూట్ మ్యాప్‌ను రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఇండో–శ్రీలంక మైత్రి సేతు వంటి అంతర్జాతీయ సైకిల్ యాత్రలు భారత్, శ్రీలంక దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో ఇన్‌ఛార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, ఏఎస్పీ ఉపేంద్ర రెడ్డి, డీఎంహెచ్‌వో రాజేందర్, డీవైఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి, 32వ బెటాలియన్ ఎన్‌సీసీ ప్రతినిధి సంజీవ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.