📅 Thursday, 29 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
25°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS ఆడిట్ అధికారుల సమీక్షా సమావేశం.
‹
›
District News

అక్టోబర్ నెలలో మెడికల్ బోర్డు నిర్వహించని యాజమాన్యం.

◉ M VIJAYA   |   ◷ Latest
అక్టోబర్ నెలలో మెడికల్ బోర్డు నిర్వహించని యాజమాన్యం.
  • మల్రాజ్ శ్రీనివాసరావు టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు.
రెబ్బెన,సాక్షర:సింగరేణి కార్మికులకు ప్రతి ఏరియాలోని ఏరియా ఆసుపత్రులలో 1998కి ముందు ఉన్నట్టుగా మెడికల్ బోర్డు నిర్వహిస్తామని ప్రతి కార్మికుడిని ఆన్ ఫిట్ చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించినప్పటికీ యాజమాన్యం అక్టోబర్ నెలలో అసలు మెడికల్ బోర్డు నిర్వహించలేదని దీనిపై ఏఐటియుసి,ఐఎన్టియుసి యూనియన్లు నోరు మెదపడం లేదని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాసరావు ఆరోపించారు.గురువారం కైరిగూడ ఓపెన్ కాస్ట్ ను సందర్శించిన ఆయన కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకపక్క మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని మరొక పక్క కార్మికులకు వేతనాలు పెరిగే వేజ్ బోర్డు కమిటి ఇప్పటివరకు వేయలేదన్నారు.ఏఐటియుసి ఒప్పందం చేసుకున్నామని చెప్పే ఒప్పందాలలో ఇప్పటివరకు ఏవీ అమలకు నోచుకోలేదన్నారు.48 సంవత్సరాలు దాటి మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క కార్మికుడిని 1998కి ముందు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్టు ఏరియా ఆసుపత్రిలోనే అన్ఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో బిఆర్ఎస్,టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికుల పక్షాన పోరాడుతామన్నారు.కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా కార్యదర్శి మారిన వెంకటేష్,ఫిట్ కార్యదర్శి బొంగు వెంకటేష్,ఏరియా నాయకులు అనీష్,కుదిరె మొగిలయ్య,కాయిత స్వామి,సంపత్ రావు అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి చందర్ నాయకులు రామచందర్,రాజమౌళి,దేవేందర్,నారాయణ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.