- బెల్లంపల్లి ఏరియా జిఎం ఎం.శ్రీరమేష్.
రెబ్బెన,సాక్షర:బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సిహెచ్పి రవాణా,పర్యావరణ పరంగా దేశంలోని బొగ్గు గనులకు ఆదర్శం అని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీరమేష్ అన్నారు.గురువారం గోలేటి సిహెచ్పి లో స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 6.0 కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి జిఎం ముఖ్య అతిధిగా హాజరయ్యారు.కార్యక్రమంలో భాగంగా అధికారులు,ఉద్యోగులతో కలిసి సిహెచ్పి ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ సింగరేణిలో గోలేటి సిహెచ్పి కి ప్రత్యేక స్థానం ఉందన్నారు. జాతీయ రహదారి మీదుగా పర్యావరణ హితంగా బొగ్గు రవాణా సాగుతుందని,అత్యధిక రేకుల రవాణా రికార్డు,స్వచ్చతలో దేశ వ్యాప్తంగా ఉన్న సిహెచ్పి లలో ఉత్తమ సిహెచ్పి గా పలుమార్లు అవార్డులు రావడం గర్వకారణం అన్నారు.సిహెచ్పి ఆవరణను మరింత పచ్చదనంతో నిండేలా చేపట్టాల్సిన చర్యల పై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటియూసి నాయకుడు అదం సమీ,ఏరియా ఇంజినీర్ వీరన్న,ఎస్ఓ టు జిఎం స్వామి రాజు,సిహెచ్పి హెచ్ఓడి కోటయ్య ,సీనియర్ పర్సనల్ అధికారి మండల శ్రీనివాస్,ఏఐటియుసి ఫిట్ కార్యదర్శి రామయ్య,ఎన్విరాన్మెంట్ అధికారి జైపాల్ జాదవ్,ఫారెస్ట్ అధికారిణి సుష్మ లక్ష్మి ,వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్,అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
— M VIJAYAREBBENA REPORTER