📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
22°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

మండలంలో గణంగా దసరా వేడుకలు

◉ Kotha Venugopal   |   ◷ Latest
జన్నారం సాక్షర
జన్నారం మండలంలో విజయదశిమి దసరా పండుగ వేడుకలను ప్రజలు సంతోషంగా గణంగా జరుపుకున్నారు. మంగళవారం రోజున దసరా పండుగను పురస్కరించుకొని స్థానిక పోలిస్ స్టేషన్ లో అధికారులు ఆయుద పూజ నిర్వహించారు మండలకేద్రంతోపాటు మండలంలోని గ్రామాలలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో బాగంగా ఏర్పాటుచేసిన శ్రీ దుర్గామాత అమ్మవారి మంటపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి దర్శనానికి ఉదయం నుండే భక్తులు క్యూ కట్టారు. ప్రతి గ్రామంలో గ్రామ పురోహితులు జంబిపూజ చేశారు ఈ పూజ అనంతరం ఒకరికి ఒకరు జంబి ఇచ్చి పుచ్చుకుంటూ దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అదేవిదంగా మండలంలోని ప్రజా ప్రతినిధులు తాజా మాజీ ప్రతినిధులు మండల ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్బంగా ఎక్కడ ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా స్థానిక పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.