📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
22°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

దుర్గామాత సన్నిధిలో భక్తుల ప్రత్యేక పూజలు

◉ Mohammed Shareef   |   ◷ Latest
దుర్గామాత సన్నిధిలో భక్తుల ప్రత్యేక పూజలు
  • అధిక సంఖ్యలో హాజరైన భక్తులు

నిజాంసాగర్ (సాక్షర), అక్టోబర్ 20,


నిజాంసాగర్ మండల కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిష్ఠించిన దుర్గామాత అమ్మవారి సన్నిధిలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్థానిక పురోహితులు సంజీవ్ పంతులు ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు చేసి, భక్తిశ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.పూజల అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
ఈ కార్యక్రమంలో బంజపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఉమాదేవి వినయ్ కుమార్, మాజీ ఎంపీటీసీ రీనారాణి సందీప్ కుమార్, మండల మాజీ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు మహేందర్ కుమార్‌తో పాటు భక్తులు పాల్గొన్నారు.