గత రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ గడపలే బాబు
- హెడ్ కానిస్టేబుల్ గడపలే బాబు మృతి పోలీస్ శాఖకు తీరని లోటు.. అంత్యక్రియల్లో పాల్గొన్న ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్
నిర్మల్ జిల్లా పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గడపలే బాబు (HC 2228), విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో గత రాత్రి బైంసా పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల పోలీస్ అధికారులు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.
హెడ్ కానిస్టేబుల్ గడపలే బాబు స్వగ్రామమైన నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెంబేరా గ్రామంలో నేడు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల,హాజరై, ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.అనంతరం ఎస్పీ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారితో మాట్లాడి వారి బాధను పంచుకున్నారు.క్లిష్ట సమయంలో వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,పోలీస్ శాఖ కుటుంబానికి అండగా ఉంటుందని, అవసరమైన సహకారం అందిస్తుందని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ........ హెడ్ కానిస్టేబుల్ గడపలే బాబు మృతి పోలీస్ శాఖకు తీరని లోటని పేర్కొన్నారు.విధి నిర్వహణలో ఆయన అందించిన సేవలు గుర్తుండిపోతాయని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ ఎస్. సాయికిరణ్, ముధోల్ సీఐ రవీందర్ నాయక్, తానూర్ ఎస్‌ఐ షేక్ జుబేర్ ఖాన్, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దండేకర్ సాయికుమార్, పోలీస్ సిబ్బంది,బంధుమిత్రులు తదితరులు పాల్గొని గడపలే బాబుకు నివాళులర్పించారు.
