📅 Thursday, 22 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
25°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి
  • ప్రియదర్శిని నగర్, సోఫినగర్‌లోకాలనీలలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నిర్మల్ అక్టోబర్ 20(సాక్షర ప్రతినిధి)
నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శిని నగర్, సోఫినగర్‌లోకాలనీలలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నిర్వాహకులు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిని శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ........ అమ్మవారి ఆశీస్సులు, కరుణాకటాక్షాలు భక్తులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని దుర్గామాతను ప్రార్థించారు .
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎస్పీ రాజు, కత్తి నరేందర్,మాజీ కౌన్సిలర్ ధర్మాజీగారి శ్రీనివాస్,నాయకులు చిలుక రమణ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు