📅 Thursday, 22 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
24°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

రాయసముద్రం చెరువు వద్ద అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
రాయసముద్రం చెరువు వద్ద అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు
  • పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు.. ముఖ్య అతిథులుగా ఆదర్శ్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను రామచంద్రపురం 268వ డివిజన్ పరిధిలోని రాయసముద్రం చెరువు వద్ద బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డీజే పాటలు, ఆటపాటలతో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో చెరువు పరిసరాల్లో పండుగ సందడి నెలకొంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. పూలనే దైవంగా భావించి ప్రకృతిని ఆరాధించే ఈ పండుగను ఇంత ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. బతుకమ్మ వేడుకలు మహిళల్లో ఐక్యతను పెంపొందించడంతోపాటు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని భావితరాలకు చాటిచెబుతాయని తెలిపారు. తెలంగాణ ఆడపడుచులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సంప్రదాయాలను కాపాడుకుంటూ ఇలాంటి పండుగలను ఐకమత్యంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, జగన్నాథ్ రెడ్డి, పెద్ద రాజు, శ్రీకాంత్ రెడ్డి, నవీన్ గౌడ్, రాములు యాదవ్, జైపాల్, విశాల్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.