పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
- 8 మంది అరెస్ట్, రూ.42,040 నగదు, 8 మొబైల్ ఫోన్లు,3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని జన్నారం పోలీస్ స్టేషన్ పరిధి, జన్నారం మండలం కలమడుగు గ్రామ శివారులో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో నార్కోటిక్ టీమ్/టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్‌ఐ దీకొండ రమేష్, లచ్చన్న , ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ మరియు సిబ్బంది ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి రూ.42,040 నగదు, 8 మొబైల్ ఫోన్లు,3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారి వివరాలు:1. ఎనుగుల శేఖర్, రేవోజిపేట గ్రామం, దస్రావధ్ మండలం.
2. గారెపల్లి సాగర్ గౌడ్, కలమడుగు గ్రామం, జన్నారం మండలం.
3. శ్రీరాముల రాజేశం, కలమడుగు గ్రామం, జన్నారం మండలం.
4. జక్కుల తిరుపతి, కలమడుగు గ్రామం, జన్నారం మండలం.
5. తక్కళ్లపల్లి శ్రీనివాస్, కలమడుగు గ్రామం, జన్నారం మండలం.
6. నేరెళ్ల రాజు, కలమడుగు గ్రామం, జన్నారం మండలం.
7. ఎల్. సుధాకర్, రేవోజిపేట గ్రామం, దస్రాబాధ్ మండలం.
8. గోత్రాల రమేష్, రేవోజిపేట గ్రామం, దస్రావధ్ మండలం.
అదుపులోకి తీసుకున్న 8 మందితో పాటు స్వాధీనం చేసుకున్న నగదు,మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం జన్నారం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.
