మండలకేంద్రంలో భతుకమ్మ సందడి పూలతో కళకళ
జన్నారం మండలకేంద్రం భతుకమ్మ పండుగ సందర్బంగా పూలతో కళకళలాడుతుంది. ఆదివారం జన్నారం మండలకేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాలలో సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. అంగరంగ వైబవంగా భతుకమ్మను తాయారు చేయడానికి మహిళలు పెద్దేత్తున రకరకాల పూలను సేకరిస్తారు పండుగను పురస్కరించుకొని మండలకేంద్రంలో వివిదరకాల పూల వ్యాపారాలు వెలిశాయి. ప్రతి పూజలో పూలను వాడుతారు కాని పూలతోనే బతుకమ్మను పేర్చి మాకు మంచి భతుకును అందించు అమ్మా అంటూ అమ్మవారిని వేడుకునే ప్రత్యేక పండుగ ఈ భతుకమ్మ పండుగ. పెత్ర అమావాస్య రోజు ప్రారంబించి 9 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రతి గ్రామంలో ప్రతి వీదిలో ఎక్కడివారు అక్కడే భతుకమ్మ కార్యక్రమాలను జరుపుకుంటూ ఈరొజు సంతోషంగా సద్దుల భతుకమ్మ కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకుంటారు. మండలకేంద్రంతోపాటు ప్రతి గ్రామంలో ప్రజలు సద్దుల బతుకమ్మ ప్రశాంతంగా సంతోషంగా జరుపుకునేవిదంగా ఆయా గ్రామాల సర్పంచులు కార్యదర్శులు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిదంగా ఎటువంటి శాంతిబద్రతల సమస్యరాకుండా స్థానిక ఎస్ ఐ ఉదయ్ కిరణ్ అద్వర్యంలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
