ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె 32వ రోజుకు చేరిక.
- రోడ్లు ఊడ్చి వినూత్న నిరసన.. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి వేడుకోలు
నిర్మల్ జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 32వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శుక్రవారం ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.సమ్మె శిబిరం నుంచి ప్రధాన రహదారి వరకు రోడ్లను ఊడ్చుతూ శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేశారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న తాము, నేడు తమ ఉద్యోగ భవిష్యత్తు కోసం ప్రభుత్వాన్ని వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించాలి
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 17 వేల మంది జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల సేవలను గుర్తించి క్రమబద్ధీకరించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం
అందించడంతో పాటు, క్రమబద్ధీకరణ జరిగే వరకు పూర్తి స్థూల వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతన పెరుగుదలలు,విధేయత ప్రోత్సాహకాన్ని విడుదల చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రభుత్వం తమ బాధలను అర్థం చేసుకుని చర్చలకు ఆహ్వానిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తే తిరిగి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సమ్మె నాయకులు తెలిపారు.
