📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇందూరులో 'హనుమాన్ కథ' ప్రవచన వైభవం అద్భుతం.. : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
‹
›
District News

దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి
  • బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
జిన్నారం: దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు. జిన్నారం మున్సిపల్ కేంద్రంలో అమ్మవారి ఉత్సవాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, దుర్గమ్మ కరుణాకటాక్షాలతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సింహారెడ్డి, రాజేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, వేణు రెడ్డి, భరత్ గౌడ్, వెంకట్ రెడ్డి, అనిల్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బుక్క భాస్కర్, శివ, జీవన్ రెడ్డి, నీలం విక్రమ్, రాహుల్ రెడ్డి, శివారెడ్డి, బుక్క సాయి, మనీ, సుమన్, మనీ చందన్ తదితరులు, ఉత్సవాల నిర్వాహకులు పాల్గొన్నారు.