📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

నిర్మల్‌ పట్టణం గులాబీమయం నవంబర్ 11 బీఆర్ఎస్ రైతు గర్జన సభ

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
నిర్మల్‌ పట్టణం గులాబీమయం
నవంబర్ 11 బీఆర్ఎస్ రైతు గర్జన సభ
  • కేటీఆర్ సభకు భారీ ఏర్పాట్లు.. వేదికను పరిశీలించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్.
నిర్మల్ నవంబర్ 10 సాక్షర ప్రతినిధి
నిర్మల్ జిల్లా కేంద్రంలో నవంబర్ 11 నిర్వహించనున్న బీఆర్ఎస్ రైతు గర్జన సభ నేపథ్యంలో పట్టణం గులాబీమయంగా మారింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు సభకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.
నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్న రైతు గర్జన సభ నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బాల్క సుమన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి సభా వేదికను, అక్కడ చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై నాయకులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు.
ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులకు ఎరువులు, విద్యుత్ సరఫరా సక్రమంగా జరగకపోవడంతో పంటల సాగులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పరిస్థితిని తెలియజేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు గర్జన సభలను నిర్వహిస్తున్నారని తెలిపారు.నవంబర్ 11 సాయంత్రం 4 గంటలకు నిర్మల్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించనున్న రైతు గర్జన సభకు అన్ని వర్గాల ప్రజలు, రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జిలు రామ్ కిషన్ రెడ్డి, జాన్సన్ నాయక్‌తో పాటు నాయకులు నల్ల వినయ్ రెడ్డి, లోలం శ్యాంసుందర్, కిరణ్ కొమరెవర్, మార్గొండ రాము తదితరులు పాల్గొన్నారు.