గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, ఆదివాసీ సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలి : బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి
- నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా జయంతి
నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని, భారతీయ జనతా ఎస్.టీ. మోర్చా అధ్యక్షులు నేనవత్ ఓం సింగ్ ఆధ్వర్యంలో 'జన జాతీయ గౌరవ దినోత్సవం' కార్యక్రమాల నిర్వహణపై జిల్లా పార్టీ కార్యాలయంలో సన్నాహక కార్యశాల (వర్క్‌షాప్) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి హాజరయ్యారు. ఈ కార్యశాలలో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల చరిత్ర, పోరాటాలు, వారి త్యాగాలను ప్రజలకు వివరించాలని, అలాగే ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వంపై అందరికీ అవగాహన కల్పించేలా రాబోయే కార్యక్రమాల నిర్వహణపై భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు. ఈ కార్యక్రమంలో ST మోర్చ ప్రధాన కార్యదర్శి సుందర్ సింగ్ రాథోడ్, సర్పంచ్ అన్నం గోపి, బిజేవైయం జిల్లా కార్యదర్శి దేవా నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.
