📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల అభివృద్ధికి పెద్దపీట.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‹
›
District News

నాగుల చవితి సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామికి అన్నంతో ప్రత్యేక అలంకరణ

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
నాగుల చవితి సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామికి అన్నంతో ప్రత్యేక అలంకరణ
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో నాగుల చవితి సందర్భంగా స్వామివారికి అన్నంతో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితికి విశేష ప్రాధాన్యత ఉందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.