📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల అభివృద్ధికి పెద్దపీట.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‹
›
District News

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి
  • మత్తు పదార్థాలకు దూరంగా యువత వికసిత భారతం అంశంపై యువ పార్లమెంట్ కార్యక్రమం.. పాల్గొన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్ నవంబర్ 13 సాక్షర ప్రతినిధి
నిర్మల్ పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ‘మత్తు పదార్థాలకు దూరంగా యువత – వికసిత భారతం’ అనే అంశంపై నిర్వహించిన యువ పార్లమెంట్ కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరి సందర్భంగా యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. యువత తమ శక్తి సామర్థ్యాలను దేశాభివృద్ధికి వినియోగించాలని పిలుపునిచ్చారు.
మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణంలో యువత చురుకైన పాత్ర పోషించాలని, ఆరోగ్యవంతమైన యువతతోనే అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు జమాల్, జిల్లా యువజన అధికారి రమేష్, కౌన్సిలర్లు సాదం అరవింద్, గంజి రాజు, జింక సురేందర్, శ్రీరామోజీ నరేష్, కూన శశాంక్, ఈశ్వర్, బీజేపీ నాయకులు కందుల హరీష్, భరత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.