రామచంద్రపురం పరిధిలోని భారతీనగర్ డివిజన్ ఫెన్సింగ్ ఏరియా కాలనీలో నెలకొన్న విద్యుత్ సమస్య పరిష్కారానికి బీఆర్ఎస్ నాయకులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, భారతీనగర్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి కాలనీలో పర్యటించి, ఇళ్లకు ఆనుకుని ఉండటంతో నివాసితులకు ఇబ్బందులు కలిగిస్తున్న చిన్న విద్యుత్ స్తంభాలను పరిశీలించారు. అనంతరం విద్యుత్ శాఖ ADE నాగరాజు, AE తిరుపతమ్మ, కాంట్రాక్టర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. చిన్న విద్యుత్ స్తంభాల స్థానంలో పెద్ద స్తంభాలను ఏర్పాటు చేసి, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, నరసింహ, జైపాల్, కొండల్, జాకీర్, శివ తదితరులు పాల్గొన్నారు.
— Vukkalkar VivekStaff Reporter