📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల అభివృద్ధికి పెద్దపీట.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‹
›
District News

మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు

◉ T PRAKASH RAO   |   ◷ Latest
మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు
  • టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ కూ సత్కారం
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర నవంబర్ 13:
మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ తో పాటు మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌లోని అతిథి గృహంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్నూరు కాపు సామాజిక వర్గ ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీకగా నిలిచేలా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ భవనం సామాజిక వర్గ అభ్యున్నతికి, సంఘటిత శక్తికి కేంద్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ బొబ్బిలి రామకృష్ణ, నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, రాములు ,రత్నాకర్, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.