📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల అభివృద్ధికి పెద్దపీట.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‹
›
Crime & Law

బ్యాంకులో చోరీకి యత్నించిన ముగ్గురు నిందితులను పట్టుకున్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది – నగదు రివార్డుతో అభినందించిన పోలీస్ కమిషనర్

◉ T PRAKASH RAO   |   ◷ Latest
బ్యాంకులో చోరీకి యత్నించిన ముగ్గురు నిందితులను పట్టుకున్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది – నగదు రివార్డుతో అభినందించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలోని ఒ బ్యాంకులో చోరీకి యత్నించిన ముగ్గురు నిందితులను బ్లూ కోల్ట్స్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారని నగదు రివార్డుతో పోలీస్ కమిషనర్ అభినందించారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి సమయంలో ఇండియన్ బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్‌లో చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు నిందితులను విధి నిర్వహణలో ఉన్న ఆర్మూర్ పోలీస్ స్టేషన్ బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఎస్. నాగరాజు , (పి.సి 426), ఎన్. అశోక్ , (పి.సి 1937) లు అప్రమత్తతతో, చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐ.పి.యస్ అన్నారు. బుధవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐ.పి.యస్ సంబంధిత బ్లూ కోల్ట్స్ సిబ్బందికి నగదు రివార్డులు అందజేసి , వారి విధి నిర్వహణ పట్ల ప్రశంసలు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని , రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ అనుమానాస్పద వ్యక్తులు , కార్యకలాపాలను గుర్తించి తక్షణమే స్పందించాలని సూచించారు. పోలీసుల అప్రమత్తత , సమయస్ఫూర్తి , విధి పట్ల అంకితభావం ప్రజల ఆస్తులు , ప్రాణాల రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని , విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచే సిబ్బందిని పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎసిపి వెంకటేశ్వరరెడ్డి, ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.