📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల అభివృద్ధికి పెద్దపీట.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‹
›
District News

కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు
  • తమ సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలపాలని వినతి.. అసెంబ్లీలో సమస్యలను ప్రస్తావిస్తామని కేటీఆర్ హామీ
నిర్మల్ నవంబర్ 11 సాక్షర ప్రతినిధి.
నిర్మల్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు గర్జన సభకు హాజరయ్యేందుకు వచ్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాన్వాయ్‌ను జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు అడ్డుకున్నారు. గత 30 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి కాన్వాయ్‌ను నిలిపివేశారు. తమ సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలపాలని కేటీఆర్‌ను కోరారు.అనంతరం ఉద్యోగ సంఘం నాయకులు కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల మంది జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించడం, సమాన పనికి సమాన వేతనం కల్పించడం, పెండింగ్‌లో ఉన్న వేతన పెంపుదల, విధేయతా ప్రోత్సాహక బకాయిలు చెల్లించడం వంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
దీనిపై కేటీఆర్ స్పందిస్తూ....... ఉద్యోగుల సమస్యలు తనకు తెలుసని,శాసనసభలో వారి సమస్యలపై కచ్చితంగా చర్చిస్తామని హామీ ఇచ్చారు. వారి పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
కేటీఆర్ హామీతో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగ సంఘం నాయకులు తమ సమస్యలకు శాసనసభలో ప్రస్తావన లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.