పంటనీటికై కదంతొక్కిన బారాసా శ్రేణులు మండలకేంద్రంలో బారీ రాస్తారోకో
పంటనీరు కొరకై బారాసా శ్రేణులు కదంతొక్కారు మండలకేంద్రంలో బారీ రాస్తారోకో చేశారు. శుక్రవారం రోజున భారతరాష్ట్రసమితి మండలశాఖ అద్వర్యంలో మండలంలోని పంటలకు సాగునీరు అందించాలనే డిమాండ్ తో మండలకేంద్రంలో బారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. మండలంలోని గ్రామాలనుండి తరలివచ్చిన పార్టి నాయకులు రైతులు మండలకేంద్రంలోని నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి అందరు మండలకేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్దనుండి ర్యాలీగా బయలుదేరి పాత బస్టాండ్ నుండి మండల రాస్తారోకో కేంద్రం వద్దకు చేరుకొని అక్కడ ప్రధాన రహదారిపై బారీ రాస్తారోకో చేశారు అక్కడ నుండి ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా పార్టి మండల అద్యక్ష కార్యదర్శులు గుర్రం రాజారాంరెడ్డి సులువ జనార్దన్ లు మాట్లాడుతూ అన్నదాతలు పండించిన పంటలు చేతికందే దశలో కడెం ప్రాజెక్ట్ నీరు నిలిపివేయడంతో అన్నదాతలు ఆందోళనలో పడ్డారని సకాలంలో సాగునీరు రాకుంటే రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టి ప్రభుత్వం రైతులకోరకు అది చేశాం ఇది చేశాం పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్న నాయకులు కండ్ల ముందు చేతికచ్చిన పంట చేజారి పోవడానికి ప్రభుత్వమే కారణం అవుతుందని ఒక్కసారి ఈ పరిస్థితిని పరిశీలించి అన్నదాతలను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టి జిల్లా మండల నాయకులు జాడి గంగాధర్ సుతారి వినయ్ ఫజల్ ఖాన్ పేరం శ్రీనివాస్ శ్రీకాంత్ రెడ్డి సిటిమల్ల భరత్ కుమార్ బాలసాని శ్రీనివాస్ గౌడ్ బోర్లకుంట ప్రభుదాస్ బబ్లు బూతం శ్రీనివాస్ కొత్త తిరుపతి సీపతి ఆనందం శ్రీనివాస్ రెడ్డి పిండి నరేష్ జంగం రవి లెక్కల మల్లయ్య ఐలవేణి రవి ఇప్ప రాకేశ్ రాజు నాయక్ రైతులు తదితరులు పాల్గొన్నారు.
