📅 Friday, 06 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
30°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS యాదవ ఇంటెలెక్చవల్ ఫోరం జిల్లా అధ్యక్షురాలిగా మంజులా యాదవ్
‹
›
District News

టైగర్ జోన్ ను ఎత్తివేయాలని ఉన్నతాదికారులకు వినతి

◉ Kotha Venugopal   |   ◷ Latest
టైగర్ జోన్ ను ఎత్తివేయాలని ఉన్నతాదికారులకు వినతి
జన్నారం సాక్షర
కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఎత్తివేయాలని ఉన్నతాదికారులకు వినతి పత్రం అందించారు. శుక్రవారం రోజున సామజిక కార్యకర్త శ్రీరాముల బూమాచారి అద్వర్యంలో కేంద్రం నుండి వచ్చిన పులుల సంరక్షణ అటవీశాఖ ఉన్నతాదికారులను నిరాహార దీక్షా స్థలం నుండి అటవీశాఖ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందించారు. కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు ద్వార ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీనిని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు మూడు నెలలుగా నిరాహార దీక్ష చేస్తున్నామని ఈ విషయంలో ఈ ప్రాంత ప్రజల కష్టాలను పరిష్కరించాలని అధికారులను కోరినట్లు బూమాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో బారాసా మండలశాఖ ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్ మండల ప్రజలు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.