📅 Thursday, 05 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS ముజ్గి వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం
‹
›
District News

బోనాలతో వినూత్న నిరసన తెలిపిన NHM ఉద్యోగులు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
బోనాలతో వినూత్న నిరసన తెలిపిన NHM ఉద్యోగులు
  • 24వ రోజుకు చేరిన నిరవధిక సమ్మె.. తమ డిమాండ్లను నెరవేర్చాలని అమ్మవారికి బోనం సమర్పించి వేడుకోలు
నిర్మల్ నవంబర్ 5 సాక్షర ప్రతినిధి
నిర్మల్ జిల్లా NHM JAC ఆధ్వర్యంలో కొనసాగుతున్న జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగుల నిరవధిక సమ్మె గురువారం 24వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ నిరసనను వినూత్న రీతిలో వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా బోనాలు ఎత్తుకొని, పసుపు కుంకుమలతో సమ్మె శిబిరం నుంచి అమ్మవారి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చేలా చూడాలని మొక్కుకున్నారు.ఈ సందర్భంగా JAC నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తున్నామని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలందించిన NHM ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, సేవలను గుర్తించి న్యాయం చేయాలని కోరారు.
తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చే వరకు నిరవధిక సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు.
NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు:
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న NHM ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలి.
సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.
2022 నుంచి పెండింగ్‌లో ఉన్న 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్, 8 శాతం లాయల్టీ బోనస్‌ను వెంటనే చెల్లించాలి.
కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు భద్రత కల్పించాలి.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని NHM ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.