📅 Thursday, 05 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS బోనాలతో వినూత్న నిరసన తెలిపిన NHM ఉద్యోగులు
‹
›
District News

ముజ్గి వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
ముజ్గి వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం
  • గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి
నిర్మల్న వంబర్ 5సాక్షర ప్రతినిధి:
నిర్మల్ జిల్లా ముజ్గి వై జంక్షన్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మాయాపూర్ గ్రామానికి చెందిన యార శ్రీను (47), తన TVS ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, జంక్షన్ సమీపంలో గుర్తుతెలియని వాహనం అతని బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో యార శ్రీనుకు తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ప్రమాద స్థలంలో అతని ద్విచక్ర వాహనం పడిపోయి ఉండటాన్ని గుర్తించారు.
సమాచారం అందుకున్న నిర్మల్ రూరల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనాన్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి. లింబాద్రి తెలిపారు.