అటో ట్రాలి బోల్తా ఇద్దరికీ గాయాలు ప్రమాదాలకు నిలయం ఈ మూలమలుపు పట్టించుకోరా
జన్నారం మండలంలోని ధర్మారం రోడ్డులో అటో ట్రాలి ప్రమాదవశస్తు బోల్తా పడి ఇద్దరికీ గాయాలు అయినాయి. గురువారం రాత్రి సుమారు 8-30 గంటల సమయంలో జన్నారం నుండి జగిత్యాల వెళుతున్న అటో ట్రాలి ధర్మారం లింగయ్యపల్లె మూలమలుపు వద్ద ప్రమాదవశస్తూ కాలువలో పడిపోయింది దీంతో దానిలో వున్న ముగ్గురిలో ఇద్దరికీ గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ మూలమలుపు
జన్నారం మండలకేంద్రం నుండి ధర్మారం వెళ్ళే దారిలో లింగయ్యపల్లె చౌరస్తా వద్ద మూలమలుపు వున్నది ఇది ప్రమాదాలకు ఒక అడ్డగా మారింది ఇక్కడ రోడ్డు సరిగ్గా వుండదు పెద్ద గుంత వుంటుంది అక్కడ కడెం కాలువ ఉండడంతో కాలువపై వున్న స్లాబు చాలాసార్ల పగిలిపోయింది దానిని ఎవరు మరమ్మత్తులు చేయరు దీనిపై ఎన్నిసార్లు ఎందరికి పిర్యాదులు చేసిన ఎన్నిసార్లు పత్రికలలో సోషల్ మీడియా లో ఇలా అనేక రకాలుగా ఇక్కడి పరిస్థితిని అధికారులకు ప్రజా ప్రతినిదులకు తెలిసేలా చేసినా ఎవరు పట్టించుకున్నపాపాన పోలేదు. ఇక్కడ అనేక సార్లు ప్రమాదాలు జరిగాయి ఈ ప్రమాదాలు మొత్తం మూలమలుపు రోడ్డు చెడిపోయి పెద్ద పెద్ద గుంతలతోనే జరిగాయి. ఈరొజు ఉదయం కూడా బస్సు కారు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాయి ఈ దారివెంట ప్రతి రోజు కొన్ని వందల వాహనాలు వేలుతుంటాయి ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ సమస్య పరిష్కరించాలని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు.
