📅 Thursday, 05 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
27°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇసుక టిప్పర్ ను పట్టుకున్న అటవీ అధికారులు
‹
›
District News

ఎండుతున్న వరి నీరందకుంటే రైతుకు ఉరే

◉ Kotha Venugopal   |   ◷ Latest
ఎండుతున్న వరి నీరందకుంటే రైతుకు ఉరే
జన్నారం సాక్షర
జన్నారం మండలంలో వరిపంటలు ఎండిపోతున్నాయి సకాలంలో నీరందకుంటే రైతులకు ఉరే అని మండల రైతు నాయకుడు తెలుగుదేశం పార్టి పార్లమెంటు బాద్యులు పులిశెట్టి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పలు గ్రామాలలో రైతులతో కలిసి పంట పొలాలలో పర్యటించిన అయన మండలంలో చాలావరకు పొలాలు సాగునీరు సకాలంలో అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని ఇప్పుడున్న సమయంలో నీరు అందకుంటే పంటలు దక్కవని దాంతో ఆత్మహత్యలే శరణ్యం అని రైతులు అంటున్నట్లు అయన తెలిపారు. అదేవిదంగా మండలంలోని కలమడుగు గ్రామ సమీపంలోని గోదావరిలో అత్తమడుగు ప్రాంతంలో నిరంతరం నీరు ఉంటుందని అక్కడనుండి మండలంలోని పలు గ్రామాలకు సాగు నీరు త్రాగు నీరు అందించేలా అధికారులు ప్రజా ప్రతినిధులు చొరవ చూపినట్లైతే ఈ ప్రాంత రైతులకు ప్రజలకు సాగు త్రాగు నీటి సమస్యలు తీరుతాయని అయన సూచించారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు మండలంలోని పంట పొలాలకు నీరు అందేలా చూడాలని అన్నదాతలను ఆదుకోవాలని అయన కోరారు. అయన వెంట రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.