📅 Thursday, 05 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
27°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఎండుతున్న వరి నీరందకుంటే రైతుకు ఉరే
‹
›
District News

వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు లాభాలెన్నో!

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు లాభాలెన్నో!
  • ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకొని ఆధునిక వ్యవసాయ పద్ధతుల వైపు అడుగులు వేయాలి – జిల్లా వ్యవసాయ అధికారి ఆసం రవి
నిర్మల్ నవంబర్ 5 సాక్షర ప్రతినిధి
సొన్ మండల పరిధిలోని మాదాపూర్ గ్రామంలో వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా పంటల సాగులో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు సమయం, శ్రమను కూడా గణనీయంగా ఆదా చేసుకోవచ్చని నిర్మల్ జిల్లా వ్యవసాయ అధికారి ఆసం రవి తెలిపారు.గురువారం మాదాపూర్ రైతువేదికలో వ్యవసాయ శాఖ, వివిధ బ్యాంకుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యవసాయ యాంత్రీకరణ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పి ఎం ఈ జి పి సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ ఎస్ ఎం ఎ ఎం, పీఎం ఎఫ్ఎం, ఈ అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఐఎఫ్ వంటి పలు ప్రతిష్టాత్మక పథకాల ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు అవసరమైన యంత్ర పరికరాలను రాయితీపై అందిస్తున్నాయని వివరించారు.అంతేకాకుండా యువ రైతులు చిన్న, మధ్య తరహా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయాలు కల్పించడంతో పాటు వడ్డీ రాయితీలు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఎఫ్ బి ఓ లు, రైతు సహకార సంఘాలు కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసుకునేందుకు 40 శాతం వరకు రాయితీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.రైతులు ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రాయితీలపై అవగాహన పెంచుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.అనంతరం తెలంగాణ గ్రామీణ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ అధికారుల బృందం రైతులకు ఆయా బ్యాంకులు అందిస్తున్న వివిధ వ్యవసాయ రుణాలు, పథకాలు, ఆర్థిక సహాయంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సౌమ్య మల్లేష్, ఏఈఓ రాజ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి జయలక్ష్మి, బ్యాంకు అధికారులు పుష్పలత, కిషోర్, అవినాష్, పవన్, భరత్‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.