📅 Thursday, 05 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
27°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఎండుతున్న వరి నీరందకుంటే రైతుకు ఉరే
‹
›
District News

చేయూత పింఛను దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పూర్తి చేయాలి.

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
చేయూత పింఛను దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పూర్తి చేయాలి.
  • ప్రజలకు తాగు నీటి ఇబ్బందులు కలగకుండా చూడాలి.జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
నిర్మల్ నవంబర్ 5 సాక్షర ప్రతినిధి
చేయూత పింఛను దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలాల వారీగా చేయూత పింఛను దరఖాస్తుల పరిశీలన వివరాలను సమీక్షించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చూడాలని ఆదేశించారు.రానున్న రోజుల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ప్రణాళికాబద్ధంగా నీటి సరఫరా జరగాలని, ఎక్కడా నీటి సమస్య రాకూడదని స్పష్టం చేశారు. జిల్లాలోని బోరుబావుల సమాచారాన్ని సేకరించాలని సూచించారు.జిల్లాలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు మంజూరైన ఇళ్లు, పూర్తయినవి, నిర్మాణంలో ఉన్న ఇళ్ల వివరాలను ఈ సందర్భంగా సమీక్షించారు.
అనంతరం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పీఎం శ్రీ పాఠశాలల నిర్వహణపై సమీక్షించారు. పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, వారి సామర్థ్యాల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులను క్షేత్రస్థాయి పర్యటనలకు తీసుకెళ్లాలని, జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించాలని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవ రావు, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఆర్ అండ్ బి, ఆర్డబ్ల్యూఎస్, నీటిపారుదల శాఖల ఈఈ లు సుభాష్, సందీప్, అనిల్, డిఈఓ భోజన్న, హౌసింగ్ పిడి శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.