వైద్య విద్యార్థులకు శుభవార్త - నిజామాబాద్ మెడికల్ కాలేజీకి అదనంగా 17 పిజీ సీట్ల మంజూరు
- కళాశాల ప్రిన్సిపాల్, అదనపు డిఎంఈ ప్రొఫెసర్ డా.ఎస్.క్రిష్ణమోహన్ రావు
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు అదనంగా పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ అదనంగా 17 పిజీ సీట్లను మంజూరుచేసిందని కళాశాల ప్రిన్సిపాల్, అదనపు డిఎంఈ ప్రొఫెసర్ డా.ఎ‘స్.క్రిష్ణమోహన్ రావు తెలిపారు. ఈ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రస్తుతం 81 పిజీ సీట్లు ఉండగా అదనపు మంజూరుతో వీటి సంఖ్య 98కి చేరాయని ఆయన తెలిపారు. వీటి ప్రకారం వైద్య కళాశాలకు కమ్యూనిటీ మెడిసిన్ లో 4 పిజీ సీట్లు , అనస్థీషియా లో 6 సీట్లు, పాథలాజీలో 4 సీట్లు, ప్రసూతి స్ర్తీ రోగ వైద్యంలో 3సీట్ల చొప్పున కేటాయించిందని తెలిపారు నిజామాబాద్ జిల్లాలో వైద్య విద్యకు ప్రభుత్వ కళాశాలలో పిజీ అదనపు సీట్ల మంజూరుతో డెవలప్మెంట్ లో ముందడుగు పడిందని తెలిపారు. అంతే గాక వైద్య విద్యఅభ్యాసనతోపాటు వైద్య సేవలకు ఇది శుభపరిణామమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
