📅 Friday, 06 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
31°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
‹
›
District News

5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు బాసర జోన్ క్రికెట్ జట్ల సన్నద్ధత

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు బాసర జోన్ క్రికెట్ జట్ల సన్నద్ధత
  • ప్రాక్టీస్ మ్యాచ్‌లను వీక్షించి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపిన నిర్మల్ ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్
నిర్మల్ ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్
నిర్మల్ నవంబర్ 6(సాక్షర ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17, 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026లో సత్తా చాటేందుకు బాసర జోన్ క్రికెట్ జట్లు సన్నద్ధమవుతున్నాయి.పోలీస్ సిబ్బందిలో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, జట్టు సమన్వయాన్ని పెంపొందించడంతో పాటు వారిలోని క్రీడా ప్రతిభను వెలికితీయడమే ఈ క్రీడా పోటీల ప్రధాన లక్ష్యం.ఈ క్రీడా సంబరాల్లో భాగంగా క్లస్టర్–బి పరిధిలో నిర్వహించనున్న టీ–20 క్రికెట్ పోటీల్లో మొత్తం 21 జట్లు పాల్గొననున్నాయి.ఈ నేపథ్యంలో బాసర జోన్ క్రికెట్ జట్లు పోటీలకు సిద్ధమవుతూ నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామ సమీపంలోని లక్కీ స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీలో గత రెండు రోజులుగా ప్రాక్టీస్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నాయి.ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల,అకాడమీని సందర్శించి ప్రాక్టీస్ మ్యాచ్‌లను వీక్షించారు. క్రీడాకారుల బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ నైపుణ్యాలను
పరిశీలించడంతో పాటు జట్టు సమన్వయాన్ని గమనించి వారిని అభినందించారు. క్రీడల్లో గెలుపోటములకంటే క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, సమష్టి కృషి ముఖ్యమని పేర్కొంటూ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ప్రోత్సహించారు.
ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం నిర్మల్ జిల్లాకు విచ్చేసిన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ సైతం క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొని పోలీస్ క్రీడాకారులతో కలిసి ఆట ఆడారు. అనంతరం నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల,జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, నిర్మల్ డీఎస్పీ పి. శ్రీనివాస్, జిల్లా డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.రానున్న రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో బాసర జోన్ క్రికెట్ జట్లు సమష్టి కృషి, క్రీడాస్ఫూర్తి, పట్టుదలతో రాణించి విజయాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.