సైబర్ నేరలపట్ల విద్యార్థులు జాగ్రత్తగా వుండాలి ఎస్ ఐ ఉదయ్ కిరణ్
విద్యార్థులు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా వుండాలని జన్నారం ఎస్ ఐ ఉదయ్ కిరణ్ అన్నారు. శుక్రవారం రోజున స్థానిక ఏ ఆర్ ఎస్ డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన అనే కార్యక్రమంలో అయన మాట్లాడుతూ సమాజంలో రోజు రోజు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ఈ నేరాలలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో మోసపోతున్నారని సైబర్ నేరాలనుండి మిమ్ములను కాపాడాలనే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అయన వివరించారు. సైబర్ నేరాల ఉచ్చులో పడకుండా మేము మా సిబ్బంది అందించే సూచనలు ప్రతి ఒక్క విద్యార్ధి అనుసరించాలని దాంతో ఈ నేరాలనుండి విముక్తి పొందుతారని అయన అన్నారు. అదేవిదంగా సోషల్ మీడియా విద్యార్థుల బవిష్యత్ ప్రతి విద్యార్ధి క్రమశిక్షణతో మంచిగా చదువుకొని మంచి ఉన్నత శిఖరాలను ఎదగాలని అయన సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కడ ఎటువంటి అనుమానాలు వచ్చిన మాకు మా సిబ్బందికి సమాచారం అందించాలని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ముత్యపు సతీష్ లెక్చరర్లు మోహన్ సత్తన్న రాజన్న రవి శ్రావ్య ప్రవలిక సరిత జ్యోస్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
