ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు స్లేట్ విద్యార్థినిల ఎంపిక
మండలకేంద్రంలోని స్లేట్ ఆంగ్లమ పాటశాల విద్యార్థినిలు ఎస్ జి ఎఫ్ బాస్కెట్ బాల్ రాష్ట్రస్థాయి పోటిలకు ఎంపిక అయినట్లు స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ డాక్టర్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రోజున పాటశాలలో ఈ విద్యర్తినిలను అయన అబినందించారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో నిర్వహించిన జోనల్ స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని బాస్కెట్ బాల్ అండర్-14 బాలికల విభాగంలో స్లేట్ సీబీఎస్సీ నుండి రాథోడ్ శృతిక 7వ తరగతి స్లేట్ హైస్కూల్ నుండి పెంచాల అవంతిక 8 వ తరగతి ఉత్తమ ఆటతీరును ప్రదర్శించి జోనల్ స్థాయి నుండి రాష్ట్రస్థాయికి అర్హత సాధించారని అయన వివరించారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించినప్పుడే సమగ్ర వికాసం సాధ్యమవుతుందని, రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ రజిత రెడ్డి ప్రిన్సిపాల్స్ షరీన్ ఖాన్ ప్రియ శివ వ్యాయామ ఉపాధ్యాయులు బానోత్ సంతోష్, మంతెన నాగేష్, జ్యోత్స్న, వినోద్, నాగరాజ్ ఉపాధ్యాయులు విద్యార్థినిలను అభినందించారు.
